మహమ్మారిని ఎదుర్కోవడంలో సహాయపడటానికి హైదరాబాద్‌లోని తమ బృందాలు స్థానిక అధికారులతో స్థిరంగా మరియు అంకితభావంతో పనిచేస్తున్నాయి. ఆక్సిజన్ పరికరాలు, ఐసియు పడకలు, వెంటిలేటర్లు మరియు ఇతర అవసరమైన మందులు మరియు వైద్య పరికరాల్ని అందజేస్తున్నామని మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ రోహిరా తెలిపారు. ఎస్సీఎస్సీ మరియు మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్స్ రీట్ యొక్క సంయుక్త ప్రయత్నాలు, అవసరమైన వారికి అవసరమైన వైద్య సహాయం అందించడానికి తోడ్పడతాయని సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ జనరల్ కృష్ణ ఏదుల తెలిపారు.
General
కొవిడ్ నియంత్రణలో మైండ్‌స్పేస్ రీట్ సహకారం
మైండ్‌స్పేస్ బిజినెస్ పార్కుల రీట్ హైదరాబాద్లో హెచ్ సీ ఎస్సీ, ఎస్సీఎస్సీ ద్వారా కొవిడ్ రోగులకు ఆపన్నహస్తం అందిస్తోంది. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్‌సిఎస్‌సి) మరియు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సిఎస్‌సి) ల ద్వారా ఫ్రంట్‌లైన్ యోధులు మరియు అట్టడుగు కోవిడ్ ప్రభావిత రోగులకు సహాయం చేయడానికి ఆక్సిజన్ పరికరాలు, వైద్య పరికరాల్ని అందజేస్తుంది. ఈ క్రమంలో ఉచిత అంబులెన్స్ సేవలు, కోవిడ్ రిసోర్స్ సపోర్ట్ ప్లాట్‌ఫాంలు, టెలి-కన్సల్టేషన్ మరియు ప్రైవేట్ వైద్యుల ద్వారా టెలి-మెడిసిన్ సదుపాయాల్పి కల్పిస్తుంది.
ప్రయోగశాల పరికరాలు, శస్త్రచికిత్సా పరికరాలు, అత్యవసర మందులు మరియు ఆక్సిజన్ పరికరాల్ని అందజేస్తుంది. గచిబౌలిలో ఐసోలేషన్ ఇంటర్మీడియరీ హాస్పిటల్ సదుపాయాలను ఏర్పాటు చేయడానికి మరియు హైదరాబాద్లో తేలికపాటి మరియు లక్షణం లేని కోవిడ్ రోగులకు ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి నిధులలో కొంత భాగాన్ని ఉపయోగిస్తున్నారు. కోవిడ్ బాధిత తల్లిదండ్రుల చిన్న పిల్లలకు తాత్కాలిక ఆశ్రయం కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ వారి భోజనం మరియు రోజువారీ అవసరాలు చూసుకుంటారు.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available