- మీరో మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారా?
- మీ ఇల్లు శ్రావ్యమైన సంగీత అనుభూతుల్ని మిగిల్చాలని భావిస్తున్నారా?
- మీ ఇరుగుపొరుగుతో కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటున్నారా?
- మీ జీవనశైలిని ప్రతిబింబించేలా.. సంపూర్ణ ఆత్మతో నివసించాలని ఆరాట పడుతున్నారా?
రాంకీ సంస్థ క్లబ్ హౌజును ఎంతో వైవిధ్యంగా అభివ్రుద్ధి చేస్తుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో నెలకొంది. అందుకే, దాన్ని వమ్ము చేయకుండా ఇందులోని క్లబ్ హౌజును తీర్చిదిద్దుతున్నారు. ఈసారి టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చిన్నారులకు పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ఏసీ జిమ్, బిజినెస్ లాంజ్, ఇండోర్ గేమ్స్ రూమ్, అసోసియేషన్ ఆఫీస్, ఫెసిలిటీ మేనేజర్ ఆఫీస్, స్టోర్ రూమ్, స్పా, సెలూన్, క్రెష్, ఏటీఏం వంటివన్నీ ఏర్పాటు చేస్తారు.
రాంకీ వన్ హార్మోనీ ప్రధాన ఆకర్షణల్లో ప్రముఖంగా నిలుస్తాయి.. ఇందులోని సెంట్రల్ కోర్టు యార్డు, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎల్డర్స్ కమ్యూనిటీ జోన్, ఔట్ డోర్ జిమ్ వంటివని చెప్పొచ్చు. స్కూళ్లు, కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలలు, అత్యవసరాల్లో వెళ్లేందుకు ఆస్పత్రులు వంటివన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పని చేసే ఐటీ ఉద్యోగులు ప్రతి రోజూ సులువుగానే ఇక్కడ్నుంచి రాకపోకల్ని సాగించొచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇక్కడి చుట్టుపక్కల పని చేసే ఫార్మా ఉద్యోగులకు ఈ ప్రాజెక్టు చాలా చేరువగా ఉంటుంది.