General
క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో..

క్రెడాయ్ హైదరాబాద్ ( Credai Hyderabad ) 2021 నుంచి 2023 సంవత్సరం వరకూ నూతన నిర్వహణ బృందాన్ని ఎంచుకుంది. హైదరాబాద్ నగరంలో క్రెడాయ్ కార్యక్రమాలను బలోపేతం చేసేందుకు వీరు బాధ్యత వహించడంతో పాటుగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతునందించడానికి కృషి చేయనున్నారు. ఈ నూతన బృందానికి సైతం పి. రామకృష్ణారావు అధ్యక్షునిగా వ్యవహరిస్తారు. జనరల్ సెక్రటరీగా వి. రాజశేఖర్ రెడ్డి ఎన్నికయ్యారు. జి. ఆనంద్ రెడ్డి, కాచం రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బి జగన్నాథ్ రావులు ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఆదిత్య గౌరా ట్రెజరర్‌గా, శివరాజ్ ఠాకూర్, కె రాంబాబులు జాయింట్ సెక్రటరీలుగా సేవలందిస్తారు. మిగిలిన వారంతా హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి కలిసి పని చేయనున్నారు. 13 ఆగస్టు నుంచి 15 ఆగస్టు 2021 వరకూ ప్రాపర్టీ షోను నిర్వహిస్తున్నామని క్రెడాయ్ హైదరాబాద్ వెల్లడించింది.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available