General
దుబాయ్ లో మరో లగ్జరీ విల్లా కొన్న ముకేశ్ అంబానీ

మనదేశంలోనే అత్యంత రెండో ధనవంతుడు ముఖేశ్ అంబానీ.. దుబాయ్ లో మరో లగ్జరీ విల్లా సొంతం చేసుకున్నారు. కువైట్ వ్యాపారవేత్త మహ్మద్ అల్షాయాకు చెందిన పామ జుమేరా మాన్షన్ ను 163 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.1350 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేశారు. గతనెలలోనే దుబాయ్ లో రూ.640 కోట్లతో లగ్జరీ విల్లా కొన్న ముఖేశ్.. తాజాగా అంతకుమించిన ధరతో బీచ్ సైడ్ విల్లాను సొంతం చేసుకోవడం విశేషం. తద్వారా దుబాయ్ లో రికార్డు స్థాయి డీల్ చేసిన విషయంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నారు. కాగా, ముఖేశ్ అంబానీ విదేశాల్లో భారీగా ఆస్తులు కొంటున్నారు. ప్రతిష్టాత్మక యూకే కంట్రీ క్లబ్ ను రూ.592 కోట్లకు కొనుగోలు చేసిన ఆయన.. దానిని పెద్ద కుమారుడు ఆకాశ్ కు కేటాయించినట్టు సమాచారం. దుబాయ్ లో గతనెలలో కొన్న 640 కోట్ల లగ్జరీ విల్లాను చిన్న కుమారుడు అనంత్ కు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Related News
celebrity-homes
No articles available.
No posts available
No posts available