General

కోకాపేట్ వేలం.. ఎకరా రూ.40 కోట్లు పైమాటే!

కోకాపేట్ వేలం.. ఎకరా రూ.40 కోట్లు పైమాటే!
హెచ్ఎండీఏ నిర్వహించే కోకాపేట్ వేలం పాటలకు అపూర్వ ఆదరణ లభిస్తోందని సమాచారం. భవిష్యత్తులో ఈ ప్రాంతం జరిగే గణనీయమైన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అనేక సంస్థలు భూముల్ని సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. స్వయంగా హెచ్ఎండీఏ ఈ భూముల్ని విక్రయించడం వల్ల న్యాయపరంగా ఎలాంటి చిక్కులుండవని అనేక సంస్థలు భావిస్తున్నాయి. అలా వేలం పాటలో కొనగానే.. అనుమతులూ అతివేగంగా ఇవ్వడానికి ప్రభుత్వం సమ్మతించింది. దీంతో, అనేక ఫార్మా, ఐటీ, రియల్ ఎస్టేట్ ఫండ్ సంస్థలు వేలం పాటలో పాల్గొనడానికి ముందుకొస్తున్నాయి. ప్రభుత్వమే ఎకరాకు రూ.25 కోట్లుగా నిర్ణయించడంతో.. ఈసారి వేలం పాటలో 40 కోట్ల కంటే ఎక్కువే పలికే అవకాశముందని హెచ్ఎండీఏ భావిస్తోంది.

కోకాపేట్ వేలం.. సూపర్ హిట్

[caption id="attachment_1010" align="alignleft" width="300"]aravind kumar - HMDA commissioner aravind kumar - HMDA commissioner[/caption] కోకాపేట్ వేలానికి ఊహించిన దానికంటే ఎక్కువే ఆదరణ వస్తోంది. కోకాపేట్ మన దేశంలోనే అత్యుత్తమ ప్రాంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశముంది. చుట్టుపక్కల ఐటీ సంస్థలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉండటం.. రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాలూ మెరుగ్గా వృద్ధి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నాం. అందుకే, కోకాపేట్ వేలం సూపర్ హిట్ అవుతుందనే నమ్మకముంది. - అరవింద్ కుమార్, కమిషనర్, హెచ్ఎండీఏ

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available