General

20 లక్షల రుణం.. ఈఎంఐ15 వేలు ..

20 లక్షల రుణం.. ఈఎంఐ15 వేలు ..
  • గృహరుణంపై వడ్డీ తక్కువ
  • సొంతింటిపై పెరిగిన మక్కువ
  • సరైన ఇల్లు కొనడమే రైట్
6.65 శాతం.. 6.70 శాతం.. ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయి కదా ఈ వడ్డీ రేట్లు.. ఇంతింత తక్కువ వడ్డీకే గ్రుహరుణాలు లభిస్తుంటే.. సొంతిల్లు కొనుక్కోకుండా ఎవరైనా ఆగుతారా? దీన్ని బట్టి ఇరవై లక్షల రుణం తీసుకుంటే.. వ్యవధిని బట్టి మహా అయితే పదిహేను వేలు నెలసరి వాయిదా చెల్లిస్తే సరిపోతుంది. అదే నలభై లక్షలు తీసుకుంటే.. గరిష్ఠంగా ముప్పయ్ వేలు చెల్లిస్తే చాలు. అదే వ్యవధిని ఇంకాస్త ఎక్కువ పెట్టుకుంటే.. ఈ మొత్తం మరింత తగ్గుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే మీకు నచ్చిన గ్రుహాన్ని ఎంచుకునేందుకు అడుగులు ముందుకేయండి. [caption id="attachment_138" align="alignnone" width="800"]home loan Home Loan[/caption] కొన్ని బ్యాంకులు సిబిల్ రేటు ఆధారంగా ఇంటి రుణాల్ని మంజూరు చేస్తున్నాయి. ఉదాహరణకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుంటే.. 700 కంటే ఎక్కువ పాయింట్లు వచ్చిన మహిళలకు రూ.30 లక్షల గ్రుహరుణం కావాలంటే.. 6.80 శాతం వడ్డీని మాత్రమే వసూలు చేస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు అయితే రూ.35 లక్షల్లోపు రుణం కావాలనుకునేవారికి 6.90 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఒకవేళ ఇరవై ఏళ్ల వ్యవధిని ఎంచుకుంటే మాత్రం మీరు నెలకు కట్టాల్సిన వడ్డీ 27 వేలకు అటుఇటుగా ఉండొచ్చు. మరి, ఏయే బ్యాంకులు నెలకు ఎంతెంత వడ్డీని వసూలు చేస్తున్నాయి? వాటికి ప్రాసెసింగ్ ఫీజు ఎంతో చూసేద్దామా.. ఎంత రుణం? ఎంత ఈఎంఐ?
రుణం వ్యవధి వడ్డీ రేటు ఈఎంఐ
25 లక్షల రుణం 20 ఏళ్లు 6.70% 18,935
30 లక్షల రుణం 20 ఏళ్లు 6.70% 22,722
25 లక్షల రుణం 20 ఏళ్లు 6.90% 19,382
35 లక్షల రుణం 15 ఏళ్లు 6.80% 31,069
25 లక్షల రుణం 20 ఏళ్లు 7.00% 19,382
35 లక్షల రుణం 15 ఏళ్లు 7.00% 31,459
25 లక్షల రుణం 20 ఏళ్లు 6.90% 19,233
40 లక్షల రుణం 15 ఏళ్లు 7.00% 35,953
25 లక్షల రుణం 20 ఏళ్లు 7.45% 20,063
50 లక్షల రుణం 20 ఏళ్లు 7.00% 38,765

Related News

celebrity-homes

No articles available.

No posts available
No posts available